తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2021, 12:19 PM IST

ETV Bharat / state

ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా ప్రయాణం

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని జీవించే దంపతులు ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా వెళ్తున్న దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి. బైక్​ పెట్రోల్ ట్యాంక్​పై భార్యను కూర్చోబెట్టుకుని తీసుకుళ్తున్న వాహనదారుడు.. తమ బతుకు బండి లాగడానికి ఇలా చేయడం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

husband and wife dangerous travel in Komaram Bheem asifabad district
ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా ప్రయాణం

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ జంట ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ప్రతిరోజు ద్విచక్రవాహనంపై వెళ్లి సంచుల్లో వ్యర్థాలు తీసుకుని ఇంటికి పయనమవుతారు. అలా తిరుగు ప్రయాణంలో ప్రమాదకరంగా వెళ్తున్న ఈ జంట దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.

ద్విచక్రవాహనంపై ప్రమాదకరంగా ప్రయాణం

వ్యర్థాల సంచులు భారీగా ఉండటం వల్ల వాహనం వెనక పెట్టామని, తన భార్య కూర్చోవడానికి స్థలం లేక పెట్రోల్ ట్యాంక్​పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాని ఆ వ్యక్తి తెలిపారు. ప్రమాదమని తెలిసినా వేరే గతి లేక ఇలా చేయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం దయతలిచి తమ జీవనానికి తోడ్పడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details