కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో గుడుంబా తయారీకి ఉపయోగించే 12,200 కిలోల బెల్లం, 2800 కేజీల పటికను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కీర్తి ట్రేడర్స్‌కు బెల్లం లోడ్‌తో వచ్చిన లారీని మొదట ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం కీర్తి ట్రేడర్స్ గోదాములు తనిఖీ చేసేందుకు వెళ్లారు. అందుకు యజమాని పంకజ్ అగర్వాల్ అంగీకరించలేదు. తిరిగి రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి గోదాముల్లో సోదా చేయగా 12,200 కిలోల బెల్లం, 2800 కేజీల పటికి లభ్యమైంది. వీటిని స్వాధీనం చేసుకుని.. యజమాని పంకజ్ అగర్వాల్‌పై కేసు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు.
12,200 కిలోల బెల్లం, 2800 కిలోల పటిక పట్టివేత - బెల్లం పటిక ఎక్సైజ్ పట్టివేత
గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం, పటికను కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ ఆబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గోదాముల్లో నిల్వ చేసిన పంకజ్ అగర్వాల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బెల్లం, పటిక పట్టివేత