కుమురం భీం జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం రిజర్వ్ ఫారెస్ట్‌లో గిరిజనులు చట్టవిరుద్ధంగా ఆవాసాలు ఏర్పారుచుకున్నారని అటవీ అధికారులు చెబుతున్నారు. కోలం, గొంది గూడాలను ఖాళీ చేయించి నివాస గృహాలను నేల మట్టం చేసి వారిని వెంపల్లి కలప డిపోకు తరలించారు. 67 మంది గిరిజనులను నిర్బంధించారని.. కోర్డులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ.. పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్.. శమిర్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 16 గిరిజన కుటుంబాలను టూరిజం బస్సులో ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది.
'సాయంత్రం 5 గంటల వరకు హాజరుపర్చండి' - hicourt
గిరిజనుల నిర్బంధంపై పౌరహక్కుల నేతల పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సాయంత్రం ఐదింటి వరకు 16గిరిజన కుటుంబాలను తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది.
'సాయంత్రం 5 గంటల వరకు హాజరుపర్చండి'