కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న మండల వాసులకు వాన ఉపశమనం కలిగించింది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది.
రోడ్లన్నీ జలమయం..

లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కాగజ్ నగర్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చూడండి : జలకళతో తొణికిసలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు