తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పొంగుతున్న ప్రాణహిత.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు - edateripileni varshalaku nitamunigina panta

కుమురం భీం జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. జిల్లాలోని ప్రాణహిత నది పొంగిపొర్లుతోంది. బెజ్జూర్ మండలంలోని పాపంపేట, తలాయితో పాటు పలు గ్రామాల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఉప్పోంగుతున్న ప్రాణహిత.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు

By

Published : Sep 8, 2019, 11:05 AM IST

కుమురం భీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది పొంగిపొర్లుతోంది. ప్రాణహిత వరద నీరు బెజ్జూర్ మండలంలోని పాపంపేట, తలాయి రోడ్లపై ప్రవహించడంతో పాటు గ్రామాల చుట్టూ చేరింది. మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. ప్రజలు అత్యవసర పరిస్థితిలో కూడా మండల కేంద్రానికి రాలేని పరిస్థితి నెలకొంది. తలాయి, తిక్కపల్లి, భీమారం, నాగపల్లి తదితర గ్రామాల రైతులు సాగుచేసిన వేల ఎకరాల పంట నీట మునిగింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

ఉప్పోంగుతున్న ప్రాణహిత.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details