తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమురం భీం జిల్లాలో భారీ వర్షం - rain fall in kumarambheem

కుమురం భీం జిల్లాలో గురువారం పలు చోట్ల గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కాగజ్ నగర్, కౌటాల, దహేగం, చింతలమానేపల్లి, సిర్పూర్ టి మండలాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది.

Heavy rains in Kumarambhim
కుమురం భీం జిల్లాలో భారీ వర్షం

By

Published : Mar 20, 2020, 8:10 AM IST

కుమురం భీం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు వడగండ్లుతోడై బీభత్సం సృష్టించింది. కౌటాల మండలం ముత్యంపేటలో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగజ్​నగర్ మండలం ఇస్గాం శివమల్లన్న స్వామి ఆలయ ప్రాంగణంలో గాలివాన ప్రభావానికి భారీ వృక్షం నెలకొరిగింది.

అకాల వర్షం అన్నదాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వడగండ్ల వానకు పంటలు నేరకొరిగాయి. విద్యుత్​ స్తంబాలు ఒరిగిపోయి. కొన్ని చోట్ల చెట్లు పడిపోవడం వల్ల విద్యుత్​ అంతరాయం ఏర్పడింది.

కుమురం భీం జిల్లాలో భారీ వర్షం

ఇదీ చూడండి:వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details