తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలు.. కుమురం భీం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద - భీం ప్రాజెక్టు తాజా వార్తలు

ఆసిఫాబాద్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుమురం భీం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Heavy rains .. Flooding of Kumarakom Bhim project
భారీ వర్షాలు.. కుమురం భీం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

By

Published : Jul 16, 2020, 1:28 PM IST

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆసిఫాబాద్ జిల్లాలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కొమురం భీం జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. పెద్దఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఫలితంగా అధికారులు ఒక గేటును ఎత్తి 350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 10.39 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

భారీ వర్షాలు.. కుమురం భీం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

ఇదీచూడండి: ఉరకలెత్తుతున్న కృష్ణా నది.. జూరాలకు భారీగా పెరిగిన వరద

ABOUT THE AUTHOR

...view details