రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమం మొదలైంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని జనకపూర్ గ్రామంలో 500 మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం ప్రారంభించారు.
500 మొక్కలు నాటిన జనకపూర్ గ్రామస్థులు - కొమురం భీం జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండల కేంద్రంలో అధికారులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు.
500 మొక్కలు నాటిన జనకపూర్ గ్రామస్థులు
జిల్లా కేంద్రంలోని జనకపూర్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 500 మొక్కలను ఆరో విడత హరితహారంలో భాగంగా జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు, జెడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ, జిల్లా పాలన సహాయాధికారి రాంబాబు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు మొక్కలు నాటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.