తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం... తెలంగాణకు వరం - కాగజ్​నగర్​ ఎమ్మెల్యే

రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లివిరిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ హరితహారం చేపట్టారని కాగజ్​నగర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. హరితహారం తెలంగాణకు వరమని కొనియాడారు.

హరితహారం... తెలంగాణకు వరం

By

Published : Nov 24, 2019, 1:35 PM IST

హరితహారం... తెలంగాణకు వరం

సీఎం కేసీఆర్​ చేపట్టిన హరిత హారాన్ని ఎంపీ సంతోష్​ కుమార్​ ప్రారంభించిన గ్రీన్​ ఛాలెంజ్​ మరో స్థాయికి తీసుకెళ్లిందని కాగజ్​నగర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభిప్రాయపడ్డారు.

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్​ కుమార్​ సవాల్​ స్వీకరించిన జిల్లా పాలనాధికారి రాజీవ్​ గాంధీ హనుమంతు మొక్కలు నాటారు. ఆసిఫాబాద్​ అంటేనే అడవుల జిల్లా అని, అడవులను సంరక్షణలో అందరూ పాలుపంచుకోవాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details