కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ 11వ వార్డులో వికలాంగుడైన జాకీర్ పాషా కాలితో ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జాకీర్ పాషా పుట్టుకతో రెండు చేతులు లేవు. తన రెండు కాళ్లను ఉపయోగిస్తూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. ఓటు హక్కునూ అలానే వినియోగించుకున్నారు జాకీర్ పాషా.
కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు - handicapped person voted with legs in kagaznagar
రెండు చేతులు లేకున్నా ప్రజాస్వామ్యాన్ని బతికించడంతో తనవంతు పాత్ర పోషించాడు ఆ యువకుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ 11వ వార్డులో జాకీర్ పాషా కాలితో ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాలితో ఓటేశాడు..
పట్టణంలోని సుప్రభాత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి తన తండ్రితో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'