కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని పంగిడిమాదారం, సలపలగూడ, మాణిక్యాపూర్, చెలిమల గ్రామల్లో పదిరోజుల పాటు ఘనంగా సాగిన గుస్సాడీ ఉత్సవాలు ముగిశాయి. ముగింపు ఉత్సవాల్లో తిర్యాణి ఎస్సై పి రామారావు పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా ముగిసిన ఆదివాసీల గుస్సాడీ ఉత్సవాలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో నిర్వహించిన గుస్సాడీ ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. పది రోజులగా అత్యంత నిష్ఠతో నిర్వహించుకున్న దీక్షలను ఆదివాసులు సంప్రదాయబద్ధంగా విరమించారు. గిరిజన సంప్రదాయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
పది రోజులగా అత్యంత నిష్ఠతో నిర్వహించుకున్న దీక్షలను ఆదివాసులు సంప్రదాయబద్ధంగా విరమించారు. తమకు, తమ గ్రామానికి ఎటువంటి వ్యాధులు, కీడు కలగకుండా ఎత్మసర్పెన్ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీలు ఏడాది పొడవునా ఎదో ఓ పండగను నిర్వహిస్తూ... వారి సంస్కృతిని కాపాడుకుంటారని ఎస్సై రామారావు తెలిపారు.
దసరాతో ప్రారంభమయ్యే ఈ గుస్సాడీ పండుగను గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకున్నారన్నారు. ఒక గ్రామం వారికి మరో ఊరి వారికి ఆథిత్యమిస్తూ.. ఎంతో ఆత్మీయతతో వారి బంధాలను బలపరచుకుంటారని వివరించారు. ఈ పోటీ ప్రపంచములో చదువుతోనే అదివాసుల అభివృద్ధి ముడిపడి ఉందని... విద్యాభివృద్ధికి తోడ్పడాలని గ్రామ పెద్దలకు విఙ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వల్క రాంచందర్, కోర్కేటా రాదా, ఆత్రం దేవశా పోలీస్ సిబ్బంది మల్లేశ్, తిరుపతి, రఘుభీంరావు తదితరులు పాల్గొన్నారు.