లాక్డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ... చేయూతనిస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పేదలకు పురపాలక సంఘం ఛైర్మన్ సద్దాం హుస్సేన్ నిత్యాసవరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని 30 వార్డుల్లోని పేదలకు 30 వాహనాల ద్వారా సరుకులు అందించారు.
కాగజ్‌నగర్‌లో పేదలకు నిత్యావసరాల పంపిణీ - LOCK DOWN UPDATES
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పేదలకు పురపాలక సంఘం ఛైర్మన్ సద్దాం హుస్సేన్ నిత్యాసవరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని 30 వార్డుల్లోని పేదలకు 30 వాహనాల ద్వారా సరుకులు అందించారు.
కాగజ్‌నగర్‌లో పేదలకు నిత్యావసరాల పంపిణీ
ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. లాక్డౌన్ సందర్భంగా ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా చూడాలన్న ఉద్దేశంతో పేదలకు సరుకులు పంపిణీ చేయటం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రతీ ఒక్కరు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.