కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించిన గంగారాం బస్తీలోని కుటుంబాలకు యూనిటీ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇటీవల ముంబయి నుంచి వచ్చిన వలస కూలీలైన దంపతులకు కరోనా పాజిటివ్ రాగా.. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కంటోన్మెంట్ వాసులకు నిత్యావసరాల పంపిణీ - lock down effect
కంటోన్మెంట్ వాసులకు నిత్యావసరాలు పంచి కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ యూనిటీ సభ్యులు దాతృత్వం చాటుకున్నారు. సుమారు 60 నిత్యావసరాల కిట్లను డీఎస్పీ స్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కంటోన్మెంట్ వాసులకు నిత్యావసరాల పంపిణీ
అనంతరం వారు కలుసుకున్న 33 మందిని అసిఫాబాద్ ఐసోలేషన్‌కు తరలించారు. గంగారాం బస్తీని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కంటోన్మెంట్ జోన్లో ఉన్న వారికి కాగజ్‌నగర్ యూనిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ స్వామి చేతుల మీదుగా 60 నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు.