ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం పాటుపడాలని జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్ లక్ష్మణ్ నాయక్ పేర్కొన్నారు. రెబ్బెన మండలం నంబాల అటవీ బ్లాకుల్లో మూడు మొక్కలు నాటారు. ఇటీవల జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటినట్లు రంజిత్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో 'విరివిగా మొక్కలు నాటుదాం' - గ్రీన్ ఛాలెంజ్ తాజా వార్త
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్ లక్ష్మణ్ నాయక్ విరివిగా మొక్కలు నాటుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో 'విరివిగా మొక్కలు నాటుదాం'
ఇదే ఛాలెంజ్‌ను ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్, సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్యకు విసిరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ పూర్ణిమ, ఫారెస్ట్ సెక్షన్ అధికారి సతీష్, బీట్ అధికారులు మహేందర్, రవి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్ పాసింగ్ పరేడ్.. విమానాల విన్యాసాలు