తెలంగాణ

telangana

ఘనంగా దండారి ఉత్సవం-అలరించిన గుస్సాడి నృత్యం

ఆదివాసీల సంప్రదాయ దండారి ఉత్సవం కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని చిన్న సాకేడా గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు గుస్సాడి నృత్యంతో సాదర స్వాగతం పలికారు. ఈ గిరిజన సంప్రదాయ పండగను ముందు తరాలు కూడా గౌరవిస్తూ..పాటించాలని సూచించారు.

By

Published : Nov 13, 2020, 6:21 PM IST

Published : Nov 13, 2020, 6:21 PM IST

Grandly Dandari festival-entertaining Gussadi dance
ఘనంగా దండారి ఉత్సవం-అలరించిన గుస్సాడి నృత్యం

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని చిన్న సాకేడా గ్రామంలో.. ఆదివాసీల పండగ దండారి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో శాసనసభ్యుడు ఆత్రం సక్కు పాల్గొన్నారు. ఆయనకు సాంప్రదాయ గుస్సాడి నృత్యంతో స్వాగతం పలికారు. జిల్లాలో దీపావళికి ముందు పదిహేను రోజుల నుంచే ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా దండారి, గుస్సాడీ వేడుకలు చేపడుతారని సక్కు వివరించారు. ముందుగా కుల సాంప్రదాయం ప్రకారం ఏత్మ సూర్ దేవతకు మొక్కులు చెల్లించి ఈ పండుగ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ముందు తరాల వారు కూడా ఈ వేడుకను గౌరవిస్తూ..పాటించాలని కోరారు. సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని సక్కు సూచించారు.

ఇవీ చదవండి: 'మీకు గుడిలోకి ప్రవేశంలేదు.. మీకోసం పూజలు చేయను'

ABOUT THE AUTHOR

...view details