కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా.పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
కుమురం భీం జిల్లాలో ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు - కాగజ్ నగర్ పట్టణంలో
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు కుమురంభీం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రాజీవ్‌కు పూలమాలలతో సిర్పూర్ కాంగ్రెస్ నివాళులు