ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. తూకాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగజ్నగర్ మండలం సీతానగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర' - తెలంగాణ వార్తలు
కాగజ్నగర్ మండలం సీతానగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. తూకాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
కాగజ్ నగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలు
తాలు లేకుండా మేలైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. మిల్లర్లు ధాన్యం తూకంలో కోతలు పెట్టకుండా అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. కరోనా రెండో దశ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రజలు కరోనాతో మరణిస్తుంటే.. మీకు ఇది అవసరమా?: హైకోర్టు