ఆసిఫాబాద్లో ఘనంగా గోరింటాకు వేడుకలు - gorintaku pandaga
ఆషాడమాసం పురస్కరించుకొని మహిళలు గోరింటాకు పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆచారమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు.
ఆసిఫాబాద్లో గోరింటాకు ఘనంగా వేడుకలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు గోరింటాకు వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ముందుగా మహిళలు అమ్మవారికి పూజలు చేసి చెట్ల నుంచి గోరింటాకు సేకరించి పెట్టుకొని ఉల్లాసంగా గడిపారు. గోరింటాకు వల్ల కలిగే ప్రయోజనాలను నేటి తరానికి పరిచయం చేసేందుకు సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకున్నట్లు తెలిపారు.