కుమురంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి మండల కేంద్రంలోని డీఆర్డిపోలో రు. 70వేల విలువైన బియ్యం ఇతర వస్తువులు తడిచిపోయాయని తహసీల్దారు మల్లికార్జున్ తెలిపారు. సుమారు 20 క్వింటాళ్ల బియ్యం, 30 కిలోల కందిపప్పు, 30 కిలోల పెసరపప్పు, 50 కిలోల పంచదార, 30 కిలోల గోధుమ పిండి, 30 కిలోల కారంపొడి, సంతూర్ సబ్బులు తడిచిపోయాయని వెల్లడించారు.
భారీ వర్షానికి డీఆర్డిపోలో తడిచిన సరుకులు
కుమురంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని డీఆర్డిపోలో బియ్యం, పప్పులు వర్షానికి తడిసిపోయాయి. సుమారు రూ.70 వేలు విలువైన బియ్యం, ఇతర సామగ్రి పాడైపోయాయని తహసీల్దారు మల్లికార్జున్ తెలిపారు.
కుమురంభీం జిల్లా వార్తలు
డిపో భవనం పైకప్పు మరమ్మతుకు గురవడం సరుకులు తడిచిపోయాయని తెలిపారు. తడిచిన బియ్యాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని.. భవనానికి త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని డీఆర్డిపో మేనేజర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ అశోక్, వీఆర్వో రమేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:చర్లపల్లి జైలులో ఖైదీల వ్యవసాయం.. 180 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి