ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌కు చెందిన మోర్లె సుమలత, తన ఆడపడుచు బెల్లంపల్లిలో రూ.5500 విలువైన బంగారం, రూ.3000 విలువైన పట్టాగొలుసులు కొనుగోలు చేశారు. అనంతరం తమ ఊళ్లకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో రెబ్బన వద్ద ఆడపడుచు దిగిపోగా సుమలత కాగజ్‌నగర్‌లో దిగింది. అనంతరం తన చేతి సంచి సగం తెరిచి ఉండటం గమనించి బంగారం కోసం వెతికింది. ఎంతకీ దొరక్కపోవడంతో దొంగతనం జరిగినట్లు తెలుసుకొని కన్నీరుమున్నీరైంది.
ఆర్టీసీ బస్సులో దొంగతనం - DONGATHANAM
ఆర్టీసీ బస్సులో మహిళ దగ్గర నుంచి బంగారం దొంగిలించాడో దుండగుడు. మహిళ చేతి సంచిలో ఉన్న బంగారు ఉంగరం, పట్టాగొలుసులు తీసుకొని పారిపోయాడు.
ఆర్టీసీ బస్సులో దొంగతనం