గిరిజనులను ఖాళీ చేయించిన అటవీ అధికారులు - అంకుశాపూర్
కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో గిరిజన గూడెంను అటవీ అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. నిర్ణీత గడువులోపు ఖాళీ చేయనందున అటవీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
కుమురంభీం జిల్లా అంకుశాపూర్ అటవీప్రాంతంలో నివసిస్తున్న గోండు, కోలాం కుటుంబాలను అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఏప్రిల్లో తమకు అటవీ హక్కు కల్పించాలని గిరిజనులు న్యాయస్థానాన్ని ఆశ్రియించారు. అంతలోనే అధికారులు ఆ రెండు గూడాల్లో నివాసం ఉండేందుకు ఎటువంటి హక్కు లేదంటూ... వారంలోగా ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపారు. నెలరోజులు గడుస్తున్న వారు వెళ్లకపోవడం వల్ల అధికారులు బలవంతంగా పంపించేశారు. గుడిసెలు, రేకులషెడ్లు కూల్చివేశారు. దాదాపు 20 కుటుంబాలను వెంపల్లి కలప డిపోకు తరలించారు. రెండురోజులుగా పిల్లలతో సహా బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఉన్నామని వాపోయారు. భోజనాలు, విశ్రాంతి సదుపాయం కూడా కల్పించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.