కుమురం భీం జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హిందూ పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి సత్యనారాయణ పట్టు వస్త్రాలను సమర్పించారు.
కన్నుల పండువగా గంగాపూర్ బాలాజీ కల్యాణ మహోత్సవం - telangana news
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గంగాపూర్ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అన్నమయ్య సంకీర్తనలు, గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామి వారిని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

కన్నుల పండువగా గంగాపూర్ బాలాజీ కల్యాణ మహోత్సవం
ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దేవుని కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని సత్యనారాయణ సూచించారు. కల్యాణ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ అచ్చేశ్వర రావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:లలితాదేవికి 2.4 లక్షల గాజులతో అలంకరణ