కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేటలో స్వర్గీయ పాల్వాయి పురుషోత్తంరావు మెమోరియల్ ఫౌండేషన్, శ్రీ బాబా రాందేవ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంలోని సెయింట్ క్లారెట్ స్కూల్లో నిర్వహించిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. వైద్య శిబిరానికి వచ్చిన వారికి డాక్టర్ సునీల్ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. 80 మందికి కంటి అద్దాలు అందజేయగా, మరో 80 మందికి విడతలవారిగా కంటి శస్త్ర చికిత్స చేయించనున్నట్లు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన - ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్వర్గీయ పురుషోత్తంరావు మెమోరియల్ ఫౌండేషన్, శ్రీ రాందేవ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన