కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో విషాదం చోటు చేసుకుంది. బర్కత్ సబ్రికి ముగ్గురు కుమారులు కాగా.... రెండో కొడుకైన జమర్ సబ్రి ఇంటి ముందు ఆడుకుంటూ ఆవరణలోని నీటి ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ జారీ పడ్డాడు. ఆడుకుంటున్న చిన్నారి కన్పించటం లేదని తల్లిదండ్రులు వెతకగా నీటి సంపులో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే సామాజిక ఆసుపత్రికి తరలించగా... అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. అక్కడి నుంచి కాగజ్‌నగర్‌కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. అప్పటి వరకు బడిబుడి అడుగులతో కళ్లముందరే తిరిగిన కుమారుడు కానరానిలోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆడుకునేందుకు వెళ్లాడు... శవమై తేలాడు! - ఆడుకునేందుకు వెళ్లాడు... శవమై తేలాడు!
బుడి బుడి అడుగులేసుకుంటూ ఇళ్లంతా తిరిగాడు. ఆడుకుంటూ అలా ఇంటి ముందుకెళ్లాడు. సరే ఆడుకుంటున్నాడులే అని తల్లిదండ్రులు ఆపలేదు. ఇంకా రావట్లేదని కాసేపయ్యాక వెళ్లి చూస్తే విగత జీవిగా నీటి సంపులో తేలాడు. సిర్పూర్ టి మండలంలో జరిగిన విషాదకర ఘటన ఇది.
Four-year-old child dies after falling into water pool