తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనడం లేదని... రోడ్డెక్కిన రైతన్నలు! - రోడ్డెక్కిన రైతులు

అధికారులు ధాన్యం కొనడం ఆలస్యం చేయడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూస్తున్నా.. అధికారులు ధాన్యం కొనకపోవడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Formers Protest In Kumuram Bheem District
ధాన్యం కొనడం లేదని... రోడ్డెక్కిన రైతన్నలు!

By

Published : May 30, 2020, 3:51 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికలపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూసినా.. అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పదిహేను రోజులుగా ధాన్యం తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నా.. అధికారులు కాలయాపన చేస్తూ.. ధాన్యం కొనడం లేదని వాపోతున్నారు. తేమ, తాలు పేరుతో.. అధికారులు కాలయాపన చేస్తున్నారని.. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తొందరగా స్పందించి.. ధాన్యం కొనుగోలు చేసి.. తమను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ఎస్సై రమేష్​ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details