కుమురం భీం జిల్లా చింతలమనేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో గల్లంతయిన అటవీసిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు. ఆదివారం ఉదయం పడవ ప్రమాదం చోటు చేసుకోగా... ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ రోజు ఉదయం చేపల కోసం వేసిన వలలకు మృతదేహాలు చిక్కినట్లు జాలర్లు సమాచారం అందించగా... ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికి తీశాయి. శవపరిక్ష నిమిత్తం సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు.
'ప్రాణహితలో గల్లంతయిన మృతదేహాల వెలికితీత' - ప్రాణహితలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులు
ఆదివారం పడవ ప్రమాదంలో ప్రాణహిత నదిలో గల్లంతయిన అటవీ సిబ్బంది మృతదేహాలను ఈరోజు వెలికితీశారు. ఘటనాస్థలంలో మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.

గల్లంతయిన మృతదేహాల వెలికితీత
ఆసుపత్రి వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. వారి కుటుంబ సభ్యులను జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, అటవీ శాఖాధికారి రంజిత్ నాయక్, ఎస్పీ మల్లారెడ్డి తదితరులు పరామర్శించారు. ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించి అటవీ శాఖ తరపున తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
గల్లంతయిన మృతదేహాల వెలికితీత
ఇవీ చూడండి:ఈనాడు కథనానికి స్పందన... సుమోటోగా స్వీకరించిన హైకోర్టు