కుమురంభీం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగజ్‌నగర్‌లో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల కోసం అధికారులు పట్టణంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు కేంద్రాల్లో, వివేకానంద జూనియర్ కళాశాల, భాలభారతి జూనియర్ కళాశాలల్లో పరీక్షలను నిర్వహించారు.
1,442 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 898 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.