తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్​లో కరోనా పాజిటివ్... యంత్రాంగం అప్రమత్తం - జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్... అప్రమత్తమైన యంత్రాంగం

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడాలేని కుమురం భీం జిల్లాలో ఓ కేసు నమోదైయింది. జిల్లా కేంద్రంలో ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకడంతో అప్రమత్తమైన జిల్లా యాంత్రాంగ నివారణ చర్యలను ముమ్మరం చేసింది.

first covid case registered in komaram bheem asifabad district headquarters
జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్... అప్రమత్తమైన యంత్రాంగం

By

Published : Jul 1, 2020, 2:28 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్‌గా వచ్చిన యువకుడు ఉండే ఆ కాలనీ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అతనితో సన్నిహితంగా తిరిగిన 19 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఆ యువకుని ద్వారా ప్రైమరీ కాంటాక్ట్ గురించి ఆరా తీసున్నారు.

పట్టణంలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొదటి కొవిడ్‌ కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇదీ చూడండి:అడవుల పెంపు లక్ష్యంగా.. పాలమూరులో కోటి సీడ్‌బాల్స్‌

ABOUT THE AUTHOR

...view details