కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని 30 వార్డుల్లో ఇంటింటికీ రాపిడ్ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెప్మా, మున్సిపల్ సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలు నమోదు చేస్తున్నారు. అనంతరం వారికి మందులు పంపిణీ చేస్తున్నారు.
కాగజ్ నగర్లో కొనసాగుతోన్న ఫీవర్ సర్వే - తెలంగాణ వార్తలు
కాగజ్ నగర్ పట్టణంలో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెప్మా, మున్సిపల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారి పేర్లు నమోదు చేసుకుని.. అప్పటికప్పుడే మందులు అందిస్తున్నారు.
fever survey, Kagaz nagar town, kumaram bheem asifabad
అన్ని వార్డుల్లో ఈ సర్వే కొనసాగుతోందని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి:తీవ్రరూపం దిశగా తౌక్టే తుఫాను