తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం - ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం వార్తలు

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Felicitation program for government hospital medical staff
ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం

By

Published : May 29, 2020, 2:10 PM IST

కరోనా కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ఆర్.ఎస్.ఎస్. సభ్యులు పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఆస్పత్రి పర్యవేక్షణ అధికారిణి కాత్యాయని, వైద్యులు సత్యనారాయణ, స్వామి, హర్షవర్దన్, నరేందర్, పలువురు నర్సులు, కార్మికులతో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ అధికారుల సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోనగిరి సతీశ్‌ బాబు వారి సేవలను కొనియాడారు.

ఇదీచూడండి: విత్తన వ్యాపారులతో వ్యవసాయాధికారి భేటీ

ABOUT THE AUTHOR

...view details