కుమురంభీం జిల్లాలో పులి దాడిలో పశువులు చనిపోవడం నిత్యకృత్యంగా మారింది. చనిపోయిన పశువులకు అటవీ శాఖ 15 నుంచి 20 వేల వరకు అటవీశాఖ పరిహారంగా అందిస్తోంది. 40 నుంచి 50 వేల వరకు విలువ ఉండే పశువులకు అధికారులు ఇచ్చే పరిహారం ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం సరిపోవట్లేదని... అధికారులతో రైతుల వాగ్వాదం - Tiger attack compensation dispute
కుమురంభీం జిల్లాలో పులి దాడిలో పశువులు చనిపోతున్నాయి. అయితే అటవీ శాఖ దానికి పరిహారంగా రూ.15 నుంచి రూ.20 వేలను అందిస్తుంది. ఆ పరిహారం సరిపోవడం లేదని... అటవీశాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు.
పరిహారం సరిపోవట్లేదని... అధికారులతో రైతుల వాగ్వాదం
పెంచికల్‌పేట్ మండలం గుండెపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో పులి దాడిలో ఎద్దు చనిపోయింది. 45 వేలకు ఎద్దును కొన్నామని.. అంతే మొత్తం పరిహారం ఇవ్వాలని అటవీ అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. పులితో భయబ్రాంతులకు గురవుతున్నాయమని.. బంధించి తరలించాలని స్థానికులు గోడు వెళ్లబోసుకున్నారు.
- ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల కేసులో మలుపులు