కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో అక్రమంగా తమ భూముల నుంచి ఇసుక రవాణా చేస్తున్నారంటూ రైతులు లారీలను అడ్డుకున్నారు. ఈ రవాణా కొరకు తమ భూముల్లో అక్రమంగా రహదారి నిర్మాణం చేశారని ఆరోపించారు.
ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు - Farmers blocking sand lorries at sirpur t mandal
తమ భూముల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను రైతులు అడ్డుకున్నారు. గత కొంత కాలంగా ఈ వ్యాపారం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలంలో చోటుచేసుకుంది.
![ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు Farmers blocking sand lorries at kumaram bhim asifabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5506673-706-5506673-1577421227396.jpg)
ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు
దేవాలయ భూముల నుంచి కూడా రవాణా చేస్తున్నారంటూ రైతులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇసుక రవాణా చేయొద్దని తెలిపారు.
ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు
ఇదీ చూడండి : నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..!