కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పాపన్నపేట్ గ్రామానికి చెందిన జాడి దిగంబర్, జాడి చిరంజీవి, సాంబయ్య అనే వ్యక్తుల వద్ద నుంచి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పాపన్నపేట్ నుంచి గూడెంకు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఈ ముగ్గురి వద్ద నుంచి 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నామని ఎస్సై సాగర్ తెలిపారు. దీనిపై విచారణ చేసి సంబంధిత వ్యక్తుల ఇంట్లో సోదాలు చేయగా 10 క్వింటాల రేషన్ బియ్యం లభ్యమైనట్లు పేర్కొన్నారు.
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. ముగ్గురిపై కేసు నమోదు - పత్తి విత్తనాలు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పాపన్నపేట్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద పోలీసులు 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సంబంధిత వ్యక్తుల ఇంట్లో సోదా చేయగా 10 క్వింటాల రేషన్ బియ్యం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని బెజ్జూరు ఎస్సై సాగర్ వెల్లడించారు.
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. ముగ్గురిపై కేసు నమోదు
ప్రభుత్వ ఆమోదం లేని నిషేధిత వస్తువులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై సాగర్ అన్నారు. ఎవరైనా గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి అమ్మినట్లయితే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఏడీఏ రాజుల నాయుడు, ఏఈవో రవితేజలతో పంచనామా నిర్వహించారు.
ఇవీ చూడండి: వైద్యుల నిర్లక్ష్యం... పోయిన ప్రాణం..!