కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ పల్లెల్లో నాటు సారా తయారీ విజృంభిస్తోంది. నాటుసారా తయారీకి అవసరమయ్యే ముడిసరుకులు బెల్లం, పటిక రవాణా జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు నిఘా పటిష్ఠం చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నాటు సారా తయారీకి ఉపయోగించే పటికను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
కాగజ్ నగర్లో పటిక పట్టివేత - Kumurambheem adilabad district news
కాగజ్ నగర్ పట్టణంలో నాటుసారా తయారీకి ఉపయోగించే పటికను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 6 క్వింటాళ్ల పటికతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Alum caught in kuburan heen asifabad district
పట్టణంలో ఒక వాహనంలో పటిక తరలిస్తున్నారని సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేయగా సుమారు 6 క్వింటాళ్ల పటిక పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు. ఈమేరకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతిక్, రాజు అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మహేందర్ సింగ్ తెలిపారు.