వరుసగా మూడో నెలలోనూ జీతంలో కోత విధించడాన్ని నిరసిస్తూ కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. జీఓ నంబర్ 27 ద్వారా ప్రభుత్వం ఏకపక్షంగా ఉద్యోగ, పెన్షనర్ల విజ్ఞప్తులు పట్టించుకోకుండా వ్యవహరించడం దారుణమన్నారు.
మూడో నెలలోనూ కోత పెట్టారు...
మూడో నెల జీతంలోనూ కోత విధిస్తూ ఏకపక్షంగా నిర్ణయించడం పట్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించి అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించిందని... ఈ మేరకు ఆదాయం సమకూరుతుందన్నారు. జీ.ఓ. నంబర్ 27ను వెంటనే రద్దు చేసి పూర్తి స్థాయి వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో పాటు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
ఇవీ చూడండి : లెక్కలు అడిగితే మంత్రికి కోపం వస్తోంది: ఉత్తమ్