తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది - KAGAZNAGAR TOWN

ఆదిలాబాద్ పార్లమెంట్​ పరిధిలో పోలింగ్​కు రంగం సిద్ధమైంది. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని నవోదయ విద్యాలయం నుంచి అన్ని  కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది చేరుకుంటున్నారు.

ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది

By

Published : Apr 10, 2019, 10:34 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రం నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది బయలుదేరారు. జిల్లా సంయుక్త పాలనాధికారి డా. పి. రాంబాబు, జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఈవీఎం తరలింపును పర్యవేక్షించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేసీ తెలిపారు. ఓటర్లు విధిగా ఓటరు స్లిప్​తో పాటు ఏదైనా ఒక గుర్తింపు పత్రం వెంట తీసుకురావాలని సూచించారు.

ఓటరు స్లిప్​తో పాటు ఒక గుర్తింపు పత్రం తీసుకురావాలి : జేసీ

ABOUT THE AUTHOR

...view details