తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతం - కో-ఆప్షన్ సభ్యులకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభినందనలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ పురపాలికలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలో నాలుగు స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. గెలుపొందిన సభ్యులకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభినందనలు తెలిపారు.

kagaznagar co option mebers election
కాగజ్​నగర్​లో ప్రశాంతంగా ముగిసిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

By

Published : Aug 3, 2020, 4:29 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పురపాలికలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 30 వార్డులు ఉన్న కాగజ్ నగర్ పురపాలికలో నాలుగు స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో సభ్యుని హోదాలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరయ్యారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపి శాలువతో సన్మానించారు.

పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన జరిగిన కో-ఆప్షన్ ఎన్నికలో... ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కోటా నుంచి గిరుగుల లక్ష్మీ, అబ్దుల్ సుబాన్​లను, మైనారిటీ కోటా నుంచి దేవయ్య, సెవంత బాయిలను 21 మంది తెరాస కౌన్సిలర్లు ప్రతిపాదించి పూర్తి మద్దతుతో ఎన్నుకున్నారు. ఎన్నికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అభినందనలు తెలిపారు. కో-ఆప్షన్ స్థానాలు తెరాస కైవసం చేసుకోవడం వల్ల తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచారు.

ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details