తెలంగాణ

telangana

ETV Bharat / state

లోతు తెలియక మునిగిపోయాడు.. ఆచూకీ కోసం గాలింపు

కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం పెన్​గంగాలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతని కోసం బుధవారం నుంచి వెతుకుతున్నారు. స్నానం కోసం నదిలోకి వెళ్లి కనిపించకుండా పోయాడు.

Drowned without knowing the river depth one man at penganga river
లోతు తెలియక మునిగిపోయాడు.. ఆచూకీ కోసం గాలింపు

By

Published : Dec 17, 2020, 2:07 PM IST

కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం పెన్​గంగాలో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వాంకిడి మండలం బంబారకు చెందిన యాదగిరి రాజేష్.. కుటుంబ సభ్యులతో కలిసి సిర్పూర్ టీ మండలంలోని టోంకిని హనుమాన్ దర్శనానికి వచ్చారు. అనతరం పక్కనే గల పెన్​గంగాలో స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా లోతు తెలియక మునిగిపోయాడు.

కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. రాజేశ్ కోసం గాలింపు చేపట్టగా.. రాత్రి కావడంతో బుధవారం ఆపివేశారు. ఈరోజు ఉదయం మళ్లీ వెతుకుతున్నారు. అయినప్పటికీ రాజేష్ ఆచూకీ లభ్యం కాలేదు. రాజేష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీరంలో వేచిచూస్తున్నారు.

ఇదీ చూడండి :'కొందరు అటవీ అధికారుల వల్లే అడవులు నాశనం'

ABOUT THE AUTHOR

...view details