కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామం నుంచి జీడీచేను వరకు వరదనీటి పారుదల కోసం ఈ మధ్యకాలంలో రూ. 16 లక్షలతో డ్రైనేజీ కాలువ నిర్మించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలువ కూలిపోయింది.
నిర్మించిన నెలరోజుల్లోనే కూలిన డ్రైనేజీ కాలువ - నిర్మించిన నెలరోజుల్లోనే కూలిన డ్రైనేజీ కాలువ
కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో నిర్మించిన కొద్దిరోజులకే డ్రైనేజీ కాలువ కూలిపోయింది. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Breaking News
నిర్మించి నెలరోజులు కూడా కాకముందే కూలిపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గం, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నాసిరకం నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:'అక్కడే తేల్చుకుందాం... అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సిద్ధంకండి'