కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని కిషన్‌నాయక్ తండా, తాటిగూడ, చింతకర్ర గ్రామాల్లో వైద్య అందించేందుకు జైనూర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది వాగులో మోకాళ్ల వరకు పారుతున్న వరదనీటిని దాటి గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉప్పొంగింది.
మోకాళ్ల వరకు పారుతున్న వాగుదాటి.. వైద్య సేవలు అందించి.. - ఆసిఫాబాద్ జిల్లాలో వాగు దాటి వైద్యం
వైద్యం అందించేందుకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది మోకాళ్ల వరకు ప్రవహిస్తోన్న వాగు దాటాల్సి వచ్చింది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉండటం వల్ల జైనూర్ మండలంలోని కిషన్‌నాయక్ తండా, తాటిగూడ, చింతకర్ర గ్రామాలకి వెళ్లి వైద్య సేవలు అందించారు.
vagu
రహదారి అంతా బురదమయం కావడంవల్ల ఈ గ్రామాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం స్తంభించింది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున గ్రామాలకి వెళ్లి వైద్య సేవలు అందించారు.