కుమురం భీం జిల్లా నూతన పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ రాజ్ మొదటి సారిగా కాగజ్నగర్ పట్టణానికి వచ్చారు. పట్టణంలోని పలు వార్డులు సందర్శించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.
తహసీల్దారు కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు.
తహసీల్దారు కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అయిందని... చిన్న చిన్న సమస్యలు తలెత్తితే దరఖాస్తు దారులకు వివరించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కాగజ్నగర్ ఆర్డీవో ఆర్ఎస్ చిత్రు, సిబ్బంది ఉన్నారు.
ఇదీ చూడండి:ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ధరణి సేవలు.. అడ్డుగా ఏజెన్సీ చట్టాలు..