తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టులపై నిఘా.. ఆసిఫాబాద్​లో డీజీపీ.. - DGP Mahender Reddy tour in Asifabad district

ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన డీజీపీ మహేందర్‌రెడ్డి... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. నెల రోజుల వ్యవధిలో పోలీస్ బాస్.. జిల్లాకు రావడం ఇది రెండోసారి.

DGP Mahender Reddy visits Asifabad district
ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన..

By

Published : Sep 2, 2020, 1:29 PM IST

Updated : Sep 2, 2020, 2:37 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో గత కొన్ని నెలలుగా మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డీజీపీ మహేందర్​రెడ్డి జిల్లాలో పర్యటించారు. ఒకటే నెలలో రెండు సార్లు పర్యటించడం ప్రత్యేకత సంతరించుకుంది.

ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రానికి చేరుకున్న డీజీపీ మహేందర్​రెడ్డి పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గణపతి లొంగుబాటు వార్తల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకోవడానికి డీజీపీ మహేందర్​రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పర్యటించారు.

మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే నేపథ్యంలో ఇంతకుముందు మావోయిస్టుల ఏరివేత అనుభవంలో ఉన్న పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆసిఫాబాద్​ నుంచి హెలికాఫ్టర్​లో ఉట్నూర్​, జైనూర్​, సిర్పూర్​ అడవి ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే నిర్వహించడానికి బయలు దేరారు. అనంతరం దేవాపూర్​ మీదుగా సిర్పూర్ నియోజకవర్గంలోని మండలం దహెగాం అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిసింది.

అందుకోసమే ఆసిఫాబాద్ జిల్లా​లో డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన..

ఇవీచూడండి:రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయండి: కిషన్​రెడ్డి

Last Updated : Sep 2, 2020, 2:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details