తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్‌ అడవుల్లో డీజీపీ రహస్య పర్యటన.. ఏం జరుగుతోంది? - DGP Mahender Reddy secret visit forest

రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆకస్మికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నెలరోజుల వ్యవధిలో ఆయన రెండోసారి ఆసిఫాబాద్‌కు రావడం చర్చనీయాంశంగా మారింది. డీజీపీ పర్యటనను పోలీసు యంత్రాంగం ఆద్యంతం గోప్యంగా ఉంచుతోంది.

DGP Mahender Reddy secret visit to Asifabad forest
అసిఫాబాద్‌ అడవుల్లో డీజీపీ రహస్య పర్యటన.. ఏం జరుగుతోంది?

By

Published : Sep 2, 2020, 4:31 PM IST

Updated : Sep 2, 2020, 4:56 PM IST

ప్రాణహిత నదీపరివాహాక ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పసిగట్టిన పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నెలరోజుల కిందట స్వయంగా ఆసిఫాబాద్‌ పర్యటనకు వచ్చిన డీజీపీ మహేందర్‌ రెడ్డి... రెండురోజులు పోలీసుయంత్రాంగానికి దిశానిర్ధేశం చేసివెళ్లారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలిక్యాప్టర్​లో ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ మహేందర్‌రెడ్డి... ఏఆర్‌ హెడ్‌క్వార్టర్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.

రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి... ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని అటవీప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌తో కలిసి... హెలిక్యాప్టర్​లో తిరిగి ఆసిఫాబాద్‌ చేరుకున్నారు. మావోయిస్టు అ్రగనేత గణపతి లొంగిపోతారనే ఊహగానాల మధ్య డీజీపీ.... ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యాంశంగా మారింది.

అసిఫాబాద్‌ అడవుల్లో డీజీపీ రహస్య పర్యటన.. ఏం జరుగుతోంది?

ఇదీ చూడండి :ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

Last Updated : Sep 2, 2020, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details