తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదు రోజులుగా ఆసిఫాబాద్​లోనే పోలీస్​ బాస్​.. అధికారులతో సమీక్ష - డీజీపీ మహేందర్​రెడ్డి సమీక్ష

DGP mahender reddy review with officials in asifabad sp office
ఐదు రోజులుగా ఆసిఫాబాద్​లోనే పోలీస్​ బాస్​.. అధికారులతో సమీక్ష

By

Published : Sep 6, 2020, 10:00 AM IST

Updated : Sep 6, 2020, 11:05 AM IST

09:58 September 06

ఐదు రోజులుగా ఆసిఫాబాద్​లోనే పోలీస్​ బాస్​.. అధికారులతో సమీక్ష

గత ఐదు రోజులుగా డీజీపీ మహేందర్​రెడ్డి ఆసిఫాబాద్​ జిల్లాలో మకాం వేశారు. తొలిరెండు రోజులు ఒకరిద్దరు అధికారులతోనే సమీక్షించిన పోలీస్​ బాస్​.. రామగుండం సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్​తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. శుక్రవారం రాత్రి మారుమూల అటవీ ప్రాంతమైన తిర్యాణి పోలీస్ స్టేషన్​ను సందర్శించారు. మావోల కదలికలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.  

తాజాగా ఆసిఫాబాద్‌ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. గత ఐదురోజులుగా జిల్లాలోని ఉండడం ప్రాధాన్యత సంతరించుకొంది. డీజీపీ పర్యటనపై పోలీస్​ శాఖ మౌనం పాటిస్తోంది.  

ఇవీచూడండి:ఆసిఫాబాద్​లోనే డీజీపీ.. ఎందుకెళ్లినట్టు.. ఏం చేస్తున్నట్టు?

                  రాత్రిపూట స్టేషన్​కు పోలీస్ బాస్​.. అసలేం జరుగుతోంది?

Last Updated : Sep 6, 2020, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details