కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామం రమణారెడ్డి నగర్‌లో 9నెలల గర్భిణి పంబాల జ్యోతికి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబీకులు వెంటనే 108కు ఫోన్ చేశారు. వారు స్పందించక పోయేసరికి 100ను ఆశ్రయించారు. అక్కడ్నుంచి సమాచారం అందుకుని తక్షణం స్పందించిన రెబ్బెన ఎస్సై రమేశ్... గోలేటి గ్రామానికి చేరుకున్నారు. ఓ ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటారు.
మానవత్వాన్ని చాటిన రెబ్బెన ఎస్సై రమేశ్ - dekonda si ramesh
రెబ్బెన ఎస్సై దీకొండ రమేశ్ మానవత్వాన్ని చాటారు. గోలేటి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడం వల్ల ఓ ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసి ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారాయన.
మానవత్వాన్ని చాటిన రెబ్బెన ఎస్సై రమేశ్
TAGGED:
దీకొండ ఎస్సై రమేశ్