కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురయ్యేవారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరిని కళాశాలలో పనిచేస్తున్న నర్సు... ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించింది. ముగ్గురికి వైద్య పరీక్షలు చేయగా వీరిలో ఇద్దరు గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ఒకరు రెండు నెలల క్రితమే గర్భం దాల్చినట్లు వైద్యులు తేల్చారు.
ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?
గిరిజన వాసులైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. వారిని చదివించి ఉన్నత స్థాయిలో చూడలనుకున్నారు. కానీ వారి ఆశలను ఎవరో కల్లోలం చేశారు. ఎవరు చేశారు... ఎందుకు చేశారు... ఎప్పుడు చేశారో తెలియదు కానీ... డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గర్భం దాల్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?
ఈ విషయాన్ని ముందే గుర్తించిన స్థానిక వైద్య సిబ్బంది... కళాశాల ప్రిన్సిపల్‌కు, తల్లిదండ్రులకు తెలుపకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఏఎన్ఎమ్, ప్రిన్సిపల్, జిల్లా గిరిజన అధికారుల సమక్షంలో విద్యార్థుల నుంచి పూర్తిస్థాయి వివరాలు సేకరించనున్నారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం
Last Updated : Dec 28, 2019, 12:23 PM IST