కరోనా వైరస్ ప్రబలకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చేయూత యూత్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్ కాలనీలోని నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టాలని, కరోనా వ్యాప్తి కాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు వారు తెలిపారు.
చేయూత యూత్ దాతృత్వం - దినసరి కూలీలు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని టీఆర్నగర్లో చైతన్య యూత్ క్లబ్ సభ్యులు దినసరి కూలీలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు
చేయూత యూత్ దాతృత్వం
ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. భౌతిక దూరంతోనే భద్రత కలుగుతుందని సూచించారు. దినసరి కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ పూర్తిస్థాయిలో పాటించాలని... ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలు కోరారు.
ఇదీ చూడండి:కరోనా వ్యాక్సిన్ తయారీ యత్నాల్లో ఐఐఎల్