టెక్నికల్ తప్పిదాలు... విద్యుత్ కోతలు... - current-kotha
అసలే వేసవికాలం... భరించలేని ఉక్కబోత... ఇలాంటి సమయంలో కరెంట్ కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా... కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇదే జరుగుతోంది. వరుస విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యుత్ కోతలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉందంటూ స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ లేక సతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌కు వెళ్లి ట్రాన్స్‌కో ఏఈ ఫిరోజ్ ఖాన్ని నిలదీశారు. ఎలాంటి ప్రకటనలు లేకుండా టెక్నికల్ తప్పిదాలు అంటూ కోతలు విధించడమేంటని ప్రశ్నించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని... లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.