రాష్ట్రంలో బుధవారం నుంచి లాక్‌డౌన్ కారణంగా మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మద్యం కోసం ప్రజలు ఎగబడ్డారు. మద్యం ప్రియులు దుకాణాల ముందు నిలబడి కావల్సినంత మద్యం తీసుకుని నిల్వ పెట్టుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణదారులు పెద్దమొత్తంలో మందు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
లాక్‌డౌన్ ఎఫెక్ట్: మద్యం దుకాణాల ముందు బారులు - కాగజ్ నగర్ వార్తలు
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం వల్ల ప్రజలు విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. పలుచోట్ల నిబంధనలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
croud at liquor shops, kagaznagar news