కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెద్ద వాగులో గల్లంతైన పశువుల కాపరి మృతదేహం లభ్యమైంది. రోజూ మాదిరిగానే సామెర సత్తన్న పశువులను మేపేందుకు శుక్రవారం పెద్దవాగు పరిసర ప్రాంతాలకు వెళ్లాడు. పశువులను వాగు దాటించే క్రమంలో వాగు ఉద్ధృతి పెరగడంతో గల్లంతయ్యాడని తోటి కాపరులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇవాళ అతని మృతదేహాన్ని గుర్తించారు.
పశువులను దాటిస్తూ వాగులో పడి మృతి - latest death news of komuram bheem asifabad
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పశువులను వాగు దాటించే క్రమంలో గల్లంతైన పశువుల కాపరి మృతదేహం లభ్యమైంది.

పశువులను దాటిస్తూ వాగులో పడి మృతి